SAKSHITHA NEWS

మన ఊరు-మన బడితో మారుతున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు

— ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది – ఎమ్మెల్యే చిరుమర్తి

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)

మన ఊరు మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారుతున్నాయని నకిరేకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలం ఆరెగూడెం గ్రామంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా రంగ రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాల కన్నా అందంగా ఉన్నాయని చిన్నారులు తమ ఆనందాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి తో పంచుకున్నారు. అనంతనం ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు నాణ్యమైన చదువుతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడిని చేపట్టిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా తయారవుతున్నాయని అన్నారు.

గత ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోకపోవడంతో నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. మన ఊరు మన బడి పథకం తో ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు మౌలిక సదుపాయాలు అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్తు మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచేన్ షెడ్లు, డైనింగ్ హాల్లు, ప్రహరీ గోడలు, డిజిటల్ క్లాస్ రూమ్స్ ల ఏర్పాటుకోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, జడ్పిటిసి సుంకరమ్మ యాదగిరి గౌడ్, సర్పంచ్ ఆరూరి లాలమ్మ నరసింహ,ఎంపీటీసీ అంజమ్మ స్వామి, ఎంపీడీవో లాజర్, మండల విద్యాధికారి కుకుట్ల నర్సింహ, వెలిమినేడు సింగల్ విండో చైర్మన్ రుద్రారపు బిక్షపతి, నాయకులు బోయపల్లి శ్రీనివాస్, రమణారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ హోదాలలో ఉన్న నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS