పేద ప్రజల జీవితాలను కాలరాసే విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం: వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *
సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్BRS పార్టీ పిలుపులో భాగంగా పెంచిన గ్యాస్ ధరలపై గ్యాస్ బుడ్డీలతో నిరసన తెలుపుతూ.. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని NTR చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు.
కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ… కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ… నిత్యవసర సరుకులతో… పాటు గ్యాస్ ధరలను విపరీతంగా పెంచుతూ… పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు.
ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కాలం చెల్లిందని, కేంద్ర ప్రభుత్వాన్ని కాలగర్భంలో కలిపితే తప్ప ప్రజలకు మంచి సదుపాయాలు అందుబాటులోకి రావని, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకొని, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.