బండియే బడిబాట రథం
సాక్షిత మోతె : రావిపహాడ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని రావిపహాడ్ ప్రాథమిక పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెడ్‌మాస్టర్ నాయకపు పరమేష్ పిల్లలతో కలిసి వినూత్నంగా బడిబాట నిర్వహిస్తున్నారు. ఆయన బైక్‌పై గ్రామంలోని వీధులు, ఇళ్లను సందర్శిస్తూ బడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ విద్యా సంవత్సరంలో రావిపహాడ్ ప్రాథమిక పాఠశాల ఫ్రీ ప్రైమరీ స్కూల్‌గా ఎంపిక కావడంతో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, విద్యా సామగ్రి, ప్రత్యేక ఉపాధ్యాయులు, ఆయాల నియామకం వంటి అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి చిన్నారి ప్రభుత్వ పాఠశాలలో చేరి నాణ్యమైన విద్యను పొందాలని కోరుతూ గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
