నులిపురుగుల నివారణే లక్ష్యం: – చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .
సాక్షిత చేవెళ్ల నియోజకవర్గం:-*జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని *చేవెళ్ల మండలం ఆలూర్ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో నిర్వహించిన ఆల్బెండజోల్ టాబ్లెట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య”
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… బాల బాలికల్లో నులిపురుగుల సమస్య నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతి ఏటా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరము రెండు విడతల్లో నులిపురుగు నివారణ మాత్రలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
