ఆర్యవైశ్య రాష్ట్ర రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా బచ్చు రాము
సాక్షిత వనపర్తి :
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య రాజకీయ కమిటీ వైస్ చైర్మన్ గా వనపర్తి ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు బచ్చు రాముని నియమించడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించడం జరిగింది నియామక పత్రాన్ని అందుకున్న బచ్చు రామును ఉద్దేశించి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులకు, విద్యార్థులకు ఆర్యవైశ్య రాష్ట్ర కమిటీ తరపున కావలసిన సహాయ సహకారాలను అందించే బాధ్యత తీసుకోవాలని అమరవాది కోరారు.
అనంతరం బచ్చు రాము మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పజెప్పిన రాష్ట్ర అధ్యక్షులకు కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు కట్టుబడి ఉంటానని ప్రతి ఆర్యవైశ్యుడికి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రమేష్ చంద్ర రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు లగిశెట్టి అశోక్ ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
