హోరా..హోరీగా.. కోదాడ పెద్ద చెరువు మత్స్య సహకార సంఘం ఎన్నిక..*
సాక్షిత:ఓట్ల లెక్కింపు జాప్యం. పొద్దు పోయిన తర్వాత తుది ఫలితం వెల్లడి.
మెజార్టీ డైరెక్టర్ పదవులు కైవసం చేసుకున్న నాగేంద్రబాబు ప్యానల్.
ప్రత్యర్థి మహేష్ ప్యానల్ లో మహేష్ ఒక్కడి
కే విజయం.
చైర్మన్ ఎన్నిక శనివారం.
కోదాడ పెద్ద చెరువు మత్స్య సొసైటీ ఎన్నికలు పోలీసు బందోబస్తు మధ్య హోరాహోరీగా జరిగాయి. కోదాడ పెద్ద చెరువు సొసైటీలో 550 మంది సభ్యులు ఉన్నారు.కాగా 9 డైరెక్టర్ పదవులు ఉన్నాయి. కాగా ఒక పదవి ఏకగ్రీవం కాగా 8 డైరెక్టర్ పదవులకు ఎన్నికల అధికారులు పోలింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టారు. సొసైటీ కి మహేష్ ప్యానల్, నాగేంద్రబాబు ప్యానల్ పోటీ పడగా నాగేంద్ర బాబు ప్యానెల్ లో నాగేంద్రబాబు తో పాటు 7 డైరెక్టర్ పదవులు కైవసం చేసుకున్నారు.
ప్రత్యర్థిగా ఉన్న మహేష్ ప్యానెల్ లో మహేష్ తప్ప ఎవరు విజయం సాధించలేదు. దీంతో నాగేంద్రబాబు చైర్మన్గా ఎన్నిక అవుతారని ఆ ప్యానల్ వర్గాలు భావిస్తున్నాయి. ఓట్ల లెక్కింపులో తీవ్రమైన జాప్యం జరగడంతో పొద్దు పోయే వరకు కూడా తుది ఫలితం వెల్లడి కాలేదు. ఓట్ల లెక్కింపు పూర్తి అయిన అనంతరం ఎన్నికల అధికారి తుది ఫలితాలు వెల్లడించారు. డైరెక్టర్లుగా విజయం సాధించిన వారు వీరే
గాదె మహేష్, శీలం నాగేంద్రబాబు, ఐతనబోయిన వెంకన్న, వేముల గోపి, శీలం లక్ష్మయ్య, గుండ్లపల్లి రామారావు, పిట్టల రామయ్య, రెడ్డి బోయిన ఉపేందర్ ఎన్నికల అధికారి వి.ఇందిరా గెలిచిన డైరెక్టర్లకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టౌన్ ఎస్ఐ సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా ముగిసాయి.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
