రైతువేదిక వద్ద యూరియా కోసం ధర్నా నిర్వహించిన : బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు.
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద ధర్నా నిర్వహించారు. మండల బి ఆర్ ఎస్ నాయకురాలు వగ్గేల పూజ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒక బస్తా యూరియా కోసం పడరాని గోస పడుతున్నారని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
