వివాహిత అనుమానస్పద మృతి : భర్తపై కేసు నమోదు
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావు పేట మున్సిపాలిటీ పరిధిలో పూల లక్ష్మి ప్రసన్న అనే వివాహిత అనుమాన స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త నరేష్ బాబు, భార్య ఇంట్లో పని చేస్తుండగా జారిపడి గాయపడిందని, చికిత్స కోసం రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్ కు తరలించామని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. అయితే హాస్పిటల్లో మృతిరాలి ఒంటిపై గాయాలను గమనించిన తల్లిదండ్రులు, భర్త నరేష్ బాబు అతని బంధువులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
