ప్రజా పాలనలో ప్రజల పడిగాపులు

Sakshitha news

ప్రజా పాలనలో ప్రజల పడిగాపులు

తీవ్ర అవస్థలు పడుతున్న రైతులు

సాక్షిత న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొలకలపల్లి
మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జ్,మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మండల కేంద్రం అగ్రికల్చర్ ఆఫీసు ముందు ధర్నా చేసి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో కి రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని వినతిపత్రం ఇచ్చిన బిఆర్ఎస్ నాయకులు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సున్నం నాగమణి,మోరంపూడి అప్పారావు,మట్ల నాగమణి మాట్లాడుతూ యూరియా కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రైతులు యూరియా కోసం యూరియా విక్రయ కేంద్రాల దగ్గర చెప్పులు,పట్టాదారు పాస్ పుస్తకాలు,ఆధార్ కార్డులతో క్యూలో పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.అబద్దపు పునాధుల మీద ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచింది,కెసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కాలర్ ఎగరేసి వ్యవసాయం చేసిన రైతును,ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం అధికారుల కాళ్ళు పట్టుకునే దుస్తుతికి తీసుకువచ్చింది.రైతు పొలానికి నీళ్లు పెడదాం అంటే కరెంట్ ఉండదు,పొలం లో ఎరువులు చల్లదాం అంటే యూరియా ఉండదు, వ్యవసాయానికి పెట్టుబడి పెడదాం అంటే రైతుబంధు రాదు,అప్పు కోసం బ్యాంకుకు వెళదాం అంటే రుణమాఫీ కాదు,ఇటువంటి చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం పోయి మల్ల కెసిఆర్ వస్తే తప్ప రైతు దుస్థితి మారదు.సమయం వచ్చినప్పుడు రైతులు, మహిళలు,నిరుద్యోగులు, విద్యార్థినిలు,వృద్దులు, అందరూ కలిసి ఓటు రూపంలో అన్ని వర్గాల వారిని అబద్దపు హామీలతో మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు శనగపాటి సీతారాములు,తాండ్ర రాంబాబు, తుర్రం శ్రీను,బండి కొమరయ్య, పుష్పాల చందర్ రావు,సున్నం బాబురావు,సాయిని సుబ్బారావు, నున్న నవీన్,నున్న సుమన్, భారత రాంబాబు,పూరేటి నర్సింహారావు,సూరం పుల్లారావు, పుప్పాల గోపి,కుంజా వెంకటేష్, తానం కృష్ణ,గడ్డం బాబురావు, సున్నంరాజు,మిడియం బాబురావు,కుంజా సూర్య నారాయణ,బజ్జురి కృష్ణ,ఊర పెద్ది వెంకన్న,పుష్పాల సాయి, గోలముడి బాలకృష్ణ,గూడపాటి సురేష్,కాకటి భాస్కర్,తమ్మిశెట్టి శ్రీను,కాంపాటి షోందు,పత్తి బిక్షం, యేసుపాక వెంకటేశ్వర్లు,కొట్టే శేషు పాల్గొన్నారు.