గుడ్డెం దొడ్డి రిజర్వాయర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కి ఘన స్వాగతం పలికిన ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ .
ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా గద్వాల నియోజకవర్గంలోని గుడ్డెం దొడ్డి రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి , వాకిటి శ్రీహరి , ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి *ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ సంపత్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి తో కలిసి హెలికాప్టర్ లో వెళ్ళి కొల్లాపూర్ లోని సోమశిల ప్రాజెక్టును సందర్శించడం జరిగింది.
అలంపూర్ నియోజక వర్గంలో పెండింగ్ లో ఉన్న నీటి పారుధాల ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని సంపత్ కుమార్ కోరడం జరిగింది.
మల్లమ్మ కుంట రిజర్వాయర్ను ఏర్పాటు చేసి అలంపూర్ నియోజకవర్గం లోని రైతులకు నీటి కష్టాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సంపత్ కుమార్ కోరడం జరిగింది.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
