మావోయిస్టుల లొంగుబాటు జీవన స్రవంతిలో కలవాలి : జిల్లా ఎస్పీ

A police officer stands with seven individuals holding envelopes.

Sakshitha news

మావోయిస్టుల లొంగుబాటు జీవన స్రవంతిలో కలవాలి : జిల్లా ఎస్పీ

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఆపరేషన్ చేయుత కార్యక్రమం నేపథ్యంలో,నిషేధిత మావోయిస్టుల పార్టీకి చెందిన 8 మంది దళ సభ్యులు లొంగిపోయారని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 314 మంది మావోయిస్టులు జనజీవనంలో కలిశారని ఎస్పీ తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రస్తుతం జిల్లాలో 5,రాష్ట్రంలో 81 మంది మావోయిస్టులు ఉన్నారని వివరించారు. లొంగిపోయిన వారికి తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి 25వేల రూపాయలు అందించామని, మిగతా మొత్తం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత వల్ల మావోయిస్టులు లొంగిపోయారని ఆయన తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం కల్పిస్తామని, జీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు.