అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన : కలెక్టర్
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం : వివిధ సమస్యలతో ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి, పాటిల్ వైద్యులను ఆదేశించారు. పాల్వంచ మండలం బంజరలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను పర్యవేక్షించి, రోగుల రికార్డులు, రిజిస్టర్లు, ఔషధ నిల్వలు, వ్యాక్సిన్ భద్రత, ల్యాబ్ సదుపాయాలను పరిశీలించారు.
