తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన : ఏడేళ్ల చిన్నారి

A child carrying a pot in a busy street.

Sakshitha news

తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన : ఏడేళ్ల చిన్నారి

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట గ్రామంలో అనుమానాస్పదంగా మరణించిన వివాహిత పూల లక్ష్మీ ప్రసన్న అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషాదకర పరిస్థితి నెలకొంది. అశ్వారావుపేట మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కురిశెట్టి నాగబాబు, స్థానిక యువతతో కలసి ఏడేళ్లు వయసున్న మృతురాలి కుమార్తెతో దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్న బాలికను చూసి అందరూ విచారం వ్యక్తం చేశారు. అంత్యక్రియల్లో గ్రామస్తులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.