SAKSHITHA NEWS

The burden of ACD charges should be withdrawn Massive rally under the leadership of CPI ML Prajapanda

ఎసిడి చార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలి

సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

విద్యుత్ కార్యాలయం ముట్టడి

విద్యుత్ ఏడికి వినతి
సాక్షిత న్యూస్ అశ్వారావుపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీడీ చార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపటాన్ని నిరసిస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపందా అశ్వారావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి విద్యుత్ శాఖ ఎడి కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపందా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ సి డి చార్జీల పేరుతో ప్రజలపై అదనపు భారాన్ని మోపుతుందని, పూర్తిస్థాయిలో ప్రజలందరికీ 24 గంటల విద్యుత్తు అందిస్తానని, 27 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల కరెంటు అందిస్తానని చెప్పుతూ డెవలప్మెంట్ చార్జీల పేరుతో అదనపు భారాన్ని మోపుతుందన్నారు.

గత నాలుగేళ్లుగా విద్యుత్ సంస్థకు 33 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నానని చెబుతున్న ఈ ప్రభుత్వం విద్యుత్ సంస్థకు ఎలాంటి రాయితీలు చెల్లించలేదని, దీంతో వేల కోట్ల రూపాయల అప్పును ప్రజలపై మరింత భారం మోపి తీర్చాలనుకుంటుందని, వెంటనే రాష్ట్రప్రభుత్వం తన చర్యలు తీసుకొని ఏ సి డి పేరుతో ప్రజలపై మరింత భారాన్ని మోపటాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ శాఖ ఏడి వెంకటేశ్వరరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోగినపల్లి ప్రభాకర్, గాండ్ల గూడెం ఎంపీటీసీ వాసం బుచ్చిరాజు, కావడిగుండ్ల కన్నాయిగూడెం కోయ రంగాపురం దిబ్బగూడెం సర్పంచులు కంగాల భూలక్ష్మి, గొంది లక్ష్మణరావు, కంగాల గోవిందు, కుంజ లక్ష్మి, సొసైటీ డైరెక్టర్ మడివి నాగేశ్వరరావు, బాడిస లక్ష్మణరావు కుంజ అర్జున్, ఏడుకొండలు, కవిత, కనితి గోపాలరావు, తెల్లం సత్యం, సాయం పోతురాజు, పండ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS