ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్ పిటిషన్లపై బుధవారమే వాదనలు ముగియగా.. న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించింది. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరఫు న్యాయవాది వాదించారు. కేసులో అరెస్టయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ/డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. 90 రోజుల్లోనే తాము ఛార్జిషీట్ వేశామని, వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్టు పోలీసుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్లు కాదన్నారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు
Related Posts
అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి
SAKSHITHA NEWS అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా శంకర్పల్లి వాసి. శంకర్పల్లి :నవంబర్ 11:తెలంగాణ గవర్నమెంట్ టీ జి పి ఎస్ సి నిర్వహించిన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఎంపిక కాబడి,ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం”
SAKSHITHA NEWS కన్న కూతురు అంత్య క్రియలకు నోచుకోని “పోగుల రాజేశం” జగ్దల్ పూర్ జైల్ నిర్బంధంలో తండ్రి – మంగళ వారం జరుగనున్న లత అంత్య క్రియలు జగిత్యాల జిల్లా / సారంగాపూర్ : గత శుక్ర వారం వరకట్న…