హైదరాబాద్: తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు. మహబూబ్‍నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం సీరియల్ షూటింగ్ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె, శనివారం రాత్రి ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్‌తో కలిసి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను తాకి.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర తీవ్రంగా గాయపడగా, ఆమెను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులు, డ్రైవర్ గాయపడ్డారు. ధారావాహికలు ‘త్రినయని’ , ‘నిన్నే పెళ్లాడుతా’ సీరియల్స్ ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పవిత్ర మృతిపై జీ తెలుగు విచారం వ్యక్తం చేసింది. ‘‘తిలోత్తమగా ఇంకెవరినీ ఊహించుకోలేం. పవిత్రా జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు’’ అని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.
కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ‘జోకలి’ సీరియల్‍తో ఆమె నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ‘రోబో ఫ్యామిలీ’, ‘గాలిపటా’, ‘రాధారామన్’, ‘విద్యా వినాయక’ సహా కన్నడలో పలు సీరియళ్లు చేశారు. తెలుగులో ‘త్రినయని’ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో తిలోత్తమగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో తనదైన నటన ప్రదర్శించారు. పవిత్ర మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆమె మృతిపై విచారం వ్యక్తం చేస్తూ తోటి నటీనటులు సామాజిక మాధ్యమాల వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ కు బయలుదేరి వెళ్లారు.…