SAKSHITHA NEWS

స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలు సంబురంగా జరిగాయి. నూతన తెలుగు సంవత్సరానికి సాంప్రదాయ సిద్ధంగా విద్యార్థులు స్వాగతం పలికారు. పాఠశాలను మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేసి, సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులు కనువిందు చేశారు.

షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని విద్యార్థులు ఆరగించి తెలుగు సాంప్రదాయాన్ని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ శ్రీ క్రోధి నామ తెలుగు సంవత్సరాదిలో ప్రతి ఒక్కరిలో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించడానికి ఉగాది పర్వదినం ప్రతి ఒక్కరిలో సాంప్రదాయ వెలుగులు నింపుతుందన్నారు. మన తెలుగు సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS