సాక్షిత : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * గాజులరామారం మహారాజ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన *తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజికవర్గం నుండి మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, సెర్ప్ సిబ్బంది,వివిధ రంగాల సభ్యులు సుమారు రెండు వేల మందికి పైగా ఈ సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.కళాకారుల ప్రదర్శనలు,జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సమావేశంలో ముఖ్య మంత్రి కెసిఆర్ పాలనలో మహిళల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను,అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి సమావేశంలో వివరించారు.
బీడీ కార్మికులకు,ఒంటరి మహిళలకు పింఛన్లు,కల్యాణలక్ష్మి,ఆరోగ్య లక్ష్మీ,కెసిఆర్ కిట్,న్యూట్రిషన్ కిట్,ఆరోగ్య మహిళ, పోలీస్ శాఖలో 33 శాతం రిజర్వేషన్,మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్,మహిళలకు విఎల్ఆర్, షీ టీమ్స్,వి హబ్ ఏర్పాటు,భరోసా, సఖీ,మహిళా ఉద్యోగునులకు ప్రసూతి సెలవులు పెంచడం,వారి రక్షణ,వంటివి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను ఘనంగా పేర్కొన్నారు. అంగన్వాడిలకు,ఆశా వర్కర్లకు,ఇతర మహిళా ఉద్యోగునులకు వేతనాలు పెంచిన విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.మహిళా డిగ్రీ కళాశాలలను విరివిగా ఏర్పాటు చేసిన విషయాన్ని తెలియజేసారు. అదే విధంగా మహిళా సంక్షేమానికి అందిస్తున్న ప్రభుత్వ పథకాలలో లబ్ది పొందిన మహిళలు అధిక సంఖ్యలో ముఖ్య మంత్రి కెసిఆర్ కి,రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వారి సంతోషాన్ని సభా ముఖంగా పంచుకున్నారు.
వివిధ రంగాలలో స్వశక్తి తో వ్యాపార,ఉద్యోగాలలో విజయం సాధించిన మహిళలు వారి సందేశాన్ని అందించారు.కుత్బుల్లాపూర్, గాజుల రామారం మహిళా పొదుపు సంఘాలకు మంజూరైన 4కోట్ల 36లక్షల రూ.ల చెక్కును వారికి అందించడం జరిగింది. అనంతరం వివిధ రంగాలలో,వివిధ ఉద్యోగాలలో ప్రతిభ కనబరిచిన మహిళలను అతిథులు శాలువాలు,మెమెంటో లతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో NMC కమీషనర్ రామకృష్ణ రావు, కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ మంగతాయారు,గాజుల రామారాం డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి,ముఖ్య అధికారులు,NMC మహిళా కార్పొరేటర్లు,కో ఆప్షన్ సభ్యులు,NMC బిఆర్ఎస్ మహిళా నాయకులు, ఆయా డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు,వివిధ రంగాల మహిళా సభ్యులు,NMC మహిళా అధికారులు,సిబ్బంది,మహిళా పోలీస్, నియోజికవర్గ వివిధ సంఘాల మహిళా సభ్యులు,మహిళా సంక్షేమ సంఘాలు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.