తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు తాడేపల్లిలోని ఆనం రామనారాయణ రెడ్డి గారి నివాసానికి మర్యాదపూర్వకంగా విచ్చేసి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి అందజేశారు.
భేటీ సందర్భంగా ఇద్దరు నేతలు గతంలో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క “ఆనం లాంటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన నాయకుడితో కలిసి గతం లో పనిచేయడం గర్వకారణం” అని కొనియాడారు. అలాగే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వివాదరహితుడు, ప్రజాహితానికి కట్టుబడి పనిచేసే నాయకుడని ప్రశంసించారు.
అదేవిధంగా, తన నివాసానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.
ఇరువురు నేతలు పరస్పర మర్యాదలు పంచుకుని, స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపారు.
ఈ భేటీ రెండు రాష్ట్రాల మధ్య సాన్నిహిత్యాన్ని, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
