జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ
ఏలూరు, : జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. మధ్యాహ్నం 2.30 సమయంలో జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చిన ఎంపీ దాదాపు 45 నిమిషాలు అన్ని విభాగాలను కలియ తిరిగి పలువురు రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న వైద్యం, ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సరైన వైద్యం అందకపోయినా, ఆసుపత్రిలో ఏదైనా ఇబ్బందులు ఎదురైనా తనకు నేరుగా కాల్ చేసి చెప్పాలని రోగులకు, వారి సహాయకులకు ఎంపీ సూచించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల ఐసీయూ, డయాలసిస్, అత్యవసర విభాగాలలో అందుతున్న సేవలను ఎంపీకి వివరించారు.
ఇట్లు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం,
ఏలూరు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
