కోవూరు ఏఎంసీ నూతన ఛైర్మన్, సభ్యులతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సమావేశం.
నూతనంగా ఎన్నికైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) ఛైర్మన్ వంశీకృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ పాటూరి రమేష్‌బాబు, ఇతర సభ్యులు తమ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమెనూతనంగా బాధ్యతలు చేపట్టిన ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల విశ్వాసానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రతి పని, ప్రతి నియామకం, ప్రతి బాధ్యతను పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రజా సేవే ధ్యేయంగా పనిచేసే వారికి మాత్రమే ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత డెల్టా ప్రాంతమైన కోవూరులో రైతుల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా తీసుకుని ఏఎంసీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోవూరు ఏఎంసీ ఛైర్మన్ వంశీకృష్ణారెడ్డి, వైస్ ఛైర్మన్ పాటూరి రమేష్‌బాబు, మార్కెట్ కమిటీ సభ్యులు ఉడత లక్ష్మి, దాసరి మురళి, బెజ్జం సునీత, చెరుకూరు హరిత, ఈడూరు చెన్నయ్య, పసుపులేటి నాగ భూషణం, వేనుంబాక మాధవమ్మ, బెల్లంకొండ రాధ, షేక్ జిలాని బాష, షేక్ మొబీన, సింగంశెట్టి లక్ష్మీ రాజ్యం, వూసూరుపాటి ప్రసాద్, సింహాద్రి శోభిత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


