ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

Man in a beige shirt sitting at a desk with decorative statues and flowers in the background.

A man seated at a desk with decorative elements behind him.

Sakshitha news

ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

కూటమి ప్రభుత్వం త‌ల‌పెట్టే మంచి ప‌నుల‌కి విఘ్నాలు తొల‌గి, దిగ్విజ‌యం అయ్యేందుకు వినాయ‌కుడు ఆశీస్సులు అందించాలి…

నవరాత్రులు వినాయక మండపాలన్నీ కళకళలాడాలి…

గుడివాడ ఆగస్టు 26: యావత్ ప్రజానికం.. కూటమి శ్రేణులకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ గణపతి నవరాత్ర మహోత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజానీకానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుభాకాంక్షలు తెలియచేస్తూ సందేశాన్ని విడుదల చేశారు.

ఆయురారోగ్యాల‌తో అంద‌రూ క్షేమంగా ఉండాల‌ని గ‌ణ‌నాథుడిని వేడుకుంటున్నానన్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజానికం మంచి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేపట్టే ప‌నుల‌కి విఘ్నాలు తొల‌గి, దిగ్విజ‌యం అయ్యేందుకు ప్రధమ పూజ్యుడు వినాయ‌కుడు ఆశీస్సులు అందించాలని ఆయన ఆకాంక్షించారు.

తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నవరాత్రులన్నీ రోజులు వినాయక మండపాలు కళకళలాడాలన్నారు.

విఘ్నాలను అధిగమించి, రాష్ట్రం పురోగమనం సాధించేలా దీవించాలని కోరుకుంటూ మరోసారి ప్రజలందరికీ ఎమ్మెల్యే రాము వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.