మండల అభివృద్ధికి సహకరిస్తాను

A political meeting involving BJP representatives and attendees.

Sakshitha news

మండల అభివృద్ధికి సహకరిస్తాను:

త్వరలో నందిగామ మండలంలో పర్యటిస్తా, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

పాలమూరు ఎంపీ డి కే. అరుణ

నందిగామ మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధి కోసం పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణమ్మని పాలమూరులోని వారి నివాసంలో కలిసి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని మండల అధ్యక్షులు వడ్ల అరవింద్ చారి ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. అరుణమ్మ సానుకూలంగా స్పందించి త్వరలో నందిగామ మండలంలో పర్యటన చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం గ్రామాలలో జరిగే అభివృద్ధి పనులు కేంద్ర నిధులతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని గ్రామాల వేగవంతమైన అభివృద్ధికి ఎంపీ నిధుల నుండి కూడా సహకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు అశోక్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా సెక్రటరీ అన్నారం రాజు, మండల ప్రధానకార్యదర్శి నర్సింహ గౌడ్, హేమంత్ నాయక్, సత్యం, రాజశేఖర్, జంగయ్య , సురేష్ తదితరులు పాల్గొన్నారు