కృష్ణాజిల్లా పోలీస్
ప్రతి విద్యార్థి ఆత్మ రక్షణలో భాగంగా సెల్ఫ్ డిఫెన్స్ ను నేర్చుకోవాలి
గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని AGK మున్సిపల్ హై స్కూల్ నందు కృష్ణాజిల్లా ఎస్పీ గారైన ఆర్ గంగాధర రావు గారి ఆదేశాల మేరకు గుడివాడ డిఎస్పి ధీరజ్ నీల్ గారి ఆధ్వర్యంలో, ఇన్స్పెక్టర్ J.R.K. హనీష్ బాబు గారు సెల్ఫ్ డిఫెన్స్ నిపుణులచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీయ రక్షణ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనే విధానాలను సీఐ గారు, నిపుణులు ప్రాక్టికల్‌గా చూపించారు. ప్రత్యేకంగా బాలికలకు స్వీయ రక్షణ అవసరం ఎంత ముఖ్యమో వివరించారు.
సమాజంలో జరుగుతున్న వివిధ రకాల నేరాల నుండి రక్షించుకోవడం కోసం విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
