పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

Sakshitha news

పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

సాక్షిత : చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, పోలిరెడ్డి పాలెం నందు ఈరోజు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
అనంతరం “సెల్ఫ్ ఎన్యూమరేషన్” అంశంపై క్విజ్, అలాగే ఎలక్ట్రిషియన్, పెయింటింగ్ వంటి విభాగాలలో పోటీలు నిర్వహించగా, విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రదానం చేయబడినవి.
ఈ విద్యా సంవత్సరంలో నిరంతర హాజరు నమోదు చేసిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేయడమే కాకుండా, విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక పురస్కారాలు ప్రదానం చేయబడినవి. విద్యార్థులు కోలాటం, జానపద నృత్యాలతో అందరిని అలరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి జై హైమావతి, ఉపాధ్యాయులు శ్రీమతి పి. సైలజ, పోటు శ్రీనివాసరావు, శ్రీమతి జి. ఆదిలక్ష్మి, శ్రీమతి కె. అరుణ, శ్రీమతి సిహెచ్. నవ్య, పేరెంట్స్ కమిటీ చైర్మన్ కరిమున్ , కమిటీ సభ్యులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగింపులో, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా వివరించబడినది

Scroll to Top