SAKSHITHA NEWS

థార్ గ్యాంగ్ ఆట కట్టించిన తెలంగాణ పోలీస్…!!!

ట్రావెల్‌ బస్సులు, దారిదోపిడీలతో హడలెత్తిస్తోన్న థార్‌ గ్యాంగ్‌(Thar Gang) ఆట కట్టించారు తెలంగాణ పోలీసులు.

మూడు రోజుల వ్యవధిలోనే రెండు ముఠాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

మధ్యప్రదేశ్‌‌లోని థార్‌, కంజర్‌ఖేర్వా గ్యాంగ్‌లను అరెస్ట్‌ చేసి రూ. కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులను పోలీసుల విచారించడంతో విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా దోపీడీల కోసం థార్‌ జిల్లా మనావర్‌, కంజర్‌ఖేర్వా ప్రాంతాలకు చెందిన దాదాపు 60 మంది దొంగలు 20 ముఠాలుగా ఏర్పడినట్టు తేలింది.

ఒక్కో ముఠాలో ముగ్గురు కారులో బయలుదేరి వెళ్తుందని వెల్లడయ్యింది.బంగారం వ్యాపారులను టార్గెట్ చేసే ఈ ముఠాలు.. బంగారం ఎలా తరలిస్తున్నారు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏ బ్యాగులో ఉంచుతారు? అనే పూర్తి సమాచారం ముందే సేకరిస్తారు. వ్యాపారులు దూరప్రాంతాలకు బస్సులో వెళ్తే కారులో వారిని అనుసరించి… ఎక్కడైనా టీ, టిఫిన్ల కోసం ఆగినప్పుడు అదును చూసి ఎత్తుకెళ్తారు. ఇటీవల రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఓ ట్రావెల్‌ బస్సులో రూ.కోటిన్నర విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురికాగా.. దీని వెనుక థార్ గ్యాంగ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు..


SAKSHITHA NEWS