గుజరాత్లో తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 36 మంది అరెస్ట్
హైదరాబాద్: గుజరాత్ సిటీలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు
చేపట్టిన భారీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ఈ మిషన్లో ఓ చార్టెడ్ అకౌంటెంట్ సహా మొత్తం 36 మంది మోస్ట్ వాటెంటెడ్ నిందితులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో ఏడుగురు సైబర్ క్రైమ్ కింగ్ పిన్స్ ఉన్నట్లు వెల్లడించారు. నిందితులపైదేశవ్యాప్తంగా మొత్తం 983 కేసులు నమోదు అయ్యాయని.. ఇందులో 11 ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, 4 ట్రేడింగ్ ప్రాడ్స్, 4 ఫిడెక్స్ ఫ్రాడ్స్, కొరియర్ ఫ్రాడ్స్క సంబంధించిన కేసులు ఉన్నట్లు సీపీ మీడియాకు వివరించారు.
కాగా, పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ఇటీవల సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. ఓటీపీ, లింక్ ల పేరుతో క్షణాల్లోనే కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో నమోదు అయిన కేసుల్లో విచారణ సందర్భంగా గుజరాత్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఒకేసారి 36 మంది మోస్ట్ వాంటెడ్ సైబర్ క్రిమినల్స్ అరెస్ట్ చేయడం గమనార్హం.