Telangana National Unity Diamond Festival celebrations in Kutbullapur Constituency…https://tejanews.co.in/mivi-duopods-a25-bluetooth/
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు…
ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో వేలాది మందితో భారీ ర్యాలీ…
పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…
పాటలతో అందర్నీ అలరించిన ప్రముఖ సింగర్లు శ్రీరామచంద్ర, పర్ణిక మాన్య, సాహితీ చాగంటిలు…
సాక్షిత: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి మల్లారెడ్డి , జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటగా కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లీం, క్రైస్తవులతో కలిసి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ నుండి వేలాది మందితో కలిసి ర్యాలీగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి చేరుకున్నారు.
జాతీయ గీతాలాపన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సింగర్లు శ్రీరామచంద్ర, పర్ణిక మాన్య, సాహితీ చాగంటిలు దేశభక్తి, ఇతర పాటలతో అందరినీ అలరించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి తెలంగాణ ప్రాంతం 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో మూడు రోజుల పాటు ‘తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు‘ ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, సమైక్య లీడర్లు, విద్యార్థులు, యువతి, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.