సావిత్రి బాయి పూలే 194వ జయంతి సందర్బంగా తెలంగాణ బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128 డివిజన్ శ్రీనివాస్ నగర్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొన్ని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు అనంతరం తాను మాట్లాడుతు భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త మరియు కవయిత్రి.మహారాష్ట్రలోతనజ్యోతి బా ఫూలేతో కలిసి భారతదేశంలో మహిళల హక్కులను మెరుగుపరచడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆమె భారతదేశ స్త్రీవాద ఉద్యమానికి మార్గదర్శకురాలిగా పరిగణించబడుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రావణ్ కుమార్ ముదిరాజ్, ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు డా|| అవిజె జేమ్స్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ మీర్జా సుల్తాన్ ఫలారుద్దీన్, దొర అరుణ్, హన్మంతు, అంబదాస్, గురుమూర్తి , లాల్ మొహమ్మెద్, సరిత, కుమారి, నాగమణి, ధనలక్ష్మి, అశ్విని తదితరులు పాల్గొన్నారు.-