వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్
బాపట్ల నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం మీ మాటే – నా బాట,భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమం లో భాగంగా నేడు కర్లపాలెం మండలం, పెదపులుగువారి పాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ మహిళలకు చీర, నిత్యావసర వస్తువులు తెచ్చుకునే సంచి, తన గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి ఆశీర్వదించమని కోరారు. అనంతరం భవిష్యత్ కు గ్యారంటీ పత్రాలలో వారి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి భవిష్యత్తు గ్యారెంటీ సంక్షేమ పథకాలు గురుంచి వివరించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ .
ముందుగా వేగేశన నరేంద్ర వర్మ పోలేరమ్మ తల్లి దేవాలయం నందు ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఆయనను గ్రామములో మేళతాలలమధ్య, భారీ ఎత్తున గ్రామప్రజలతో కలసి వచ్చి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి , స్వర్గీయ నందమురి తారక రామ రావు విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు
ఈ సంధర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ…
రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం అని ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేయాలని అన్నారు
పెదపులుగువారిపాలెం గ్రామము లోని మంచి నీటి సమస్య లేకుండా చేస్తానని ప్రతి ఇంటికి మంచి కుళాయి ఏర్పాటు చేసే బాధ్యత తనదని అన్నారు. ఇలా గ్రామములోని ప్రతి సమస్యను తన వద్దకు తీసుకువస్తే దానిని పరిష్కరించే బాధ్యత తనదన్నారు
ఈ సారి ఎన్నికలల్లో పెదపులుగు వారి పాలెం గ్రామము నుండి 500 మెజారిటీ తెప్పించే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు
మీ బిడ్డ గా నన్ను భావించి రాబోయే ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా వస్తున్న నన్ను భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు
ఈ కార్యక్రమములో తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.