SAKSHITHA NEWS

నేటి విద్యార్థులకు ఆదర్శనీయం టంగుటూరి ప్రకాశం…
-కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో టంగుటూరి జయంతి వేడుకలు


సాక్షిత రాజమహేంద్రవరం, :
కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతులు 153 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్రరావు హాజరయ్యారు. తొలుత టంగుటూరి విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ళ మాధవ్, ప్రధాన కార్యదర్శి గద్దె సుధాకర్, సభ్యులు కే. వరప్రసాద్, పిడి విజయ్, వై విజయలక్ష్మి, వై బేబీ, వై మాలతీలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రామచంద్రరావుమాట్లాడుతూ రాజమహేంద్రవరం పురపాలక సంఘం అధ్యక్షుడిగా మొదలుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి వరకు పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటి విద్యార్థులకు ఆదర్శమన్నారు.

సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా తన ప్రాణాలను ఎదురొడ్డి పోరాడిన వీరుడుగా వివరించారు. ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థిగా ఆయన ఈ కళాశాలకు అప్పట్లో సుమారు 50 ఎకరాల భూమిని కేటాయించడంలో కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. అనేక హోదాలలో ధనవంతుడిగా ఉన్న ఆయన కటిక పేదరికం కూడా చివరి దశలో అనుభవించారని చెప్పారు. ఏమీ ఆశించకుండా ఈ సమాజానికి ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేవఅన్నారు. ప్రతి ఏటా పూర్వ విద్యార్థుల సంఘం టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు పేరిట ప్రతి సంవత్సరము పీజీసెట్ ర్యాంకర్స్ కి ప్రతిభా పురస్కారాలను అందిస్తున్నామన్నారు. కళాశాల లోపల ఉన్న ప్రకాశం పంతులు విగ్రహాన్ని ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసి ఉత్సవాలు చేయాలని సదుద్దేశంతో ముందుకు సాగుతున్నమన్నారు. నిస్వార్ధంగా పనిచేసిన ప్రకాశం పంతులు ని ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినీ విద్యార్థులు కస్తూరి , విక్రం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 23 at 17.01.30

SAKSHITHA NEWS