SAKSHITHA NEWS

తిరుపతి నగరం

నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మరింత బాగా చేయాలని కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని బైరాగిపట్టెడ, తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య పనులు మరింత పటిష్టంగా చేపట్టాలన్నారు. వీధుల్లో, కాలువల్లో ఎవ్వరూ చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలా కాదని ఎవరైనా రోడ్లపైన, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే వారికి జరిమానాలు విధించాలని సిబ్బందిని ఆదేశించారు. చెత్త వాహనాలు ప్రతి రోజు ఒక నిర్దిష్ట సమయంలో ప్రతి ఇంటికి వెళ్లేలా చూడాలని అన్నారు.


SAKSHITHA NEWS