కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి

Spread the love

కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి
*ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ *
*సాక్షిత : *ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఈస్ట్ సాయి నగర్, వెస్ట్ సాయి నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 1, ఆల్విన్ కాలనీ ఫేస్ 2 కాలనీ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మరియు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా GHMC మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ను చేపట్టడం జరిగినది అని, కాలనీ లలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించడానికి చక్కటి వేదిక అని,ఇంచు మించు 15 డిపార్ట్మెంట్ అధికారులు ఒకే వేదిక ను పంచుకోవడం జరుగుతుంది అని ఆయా మీ కాలనీ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం అని, ప్రతి కాలనీ వారు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు, ఏప్రిల్ 15 వ తేదీ నుండి ప్రారంభించడం జరుగుతుంది అని కావున కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ ప్రతినిధులు,రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు ప్రతి ఒక్కరు చక్కగా సద్వినియోగం చేసుకొని మన కాలనీ లను, మన ప్రాంతాలను ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చేసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు,ఈ చక్కటి కార్యక్రమంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని, ,ప్రతి కాలనీ లో ప్రతినిధుల తో కార్పొరేటర్లు, అధికారులు సమన్వయం చేసుకొని సమస్యలు తెలుసుకొని ,త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని, కాలనీ లలో అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టి ప్రజా సమస్యలు పరిష్కారం గా ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా కాలనీ లలో పారిశుధ్య నిర్వహణ పై అలసత్వం ప్రదర్శించారదని, రోడ్లు, డ్రైనేజి, మంచి నీటి సమస్య, ఫూట్ ఫాత్, పార్క్ విధి దీపాలు, తడి చెత్త ,పొడి చెత్త నిర్వహణ, దోమల బెడద, కుక్కల బెడద రక్షణ చర్యలు, మహిళ సంరక్షణ చర్యలు, జ్వరం, ఆరోగ్య సమస్యలు, ట్రాఫిక్, పోలీస్ డయల్ 100, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్ , విద్యుత్ లైన్ లు వంటి వివిధ సమస్యల పై తెలుసుకొని త్వరితగతిన పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ చక్కటి సదవకాశం ను ప్రతి కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో GHMC అధికారులు జలమండలి DGM వెంకటేశ్వర్లు,మేనేజర్ ప్రియాంక, AE శ్రావణి, ఎంటమాలజీ AE ఉషారాణి, వెటర్నరీ వైద్య అధికారి లింగ స్వామి ,TPS సోమేశ్ , SRP సత్యనారాయణ, వర్క్ ఇన్స్పెక్టర్లు మహాదేవ్, రవి కుమార్ మరియు ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి,మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అధ్యక్షులు అనిల్ రెడ్డి, దొడ్ల రామ కృష్ణ గౌడ్, MD. ఇబ్రహీం, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర మరియు కాశినాథ్ యాదవ్, మాజీ అధ్యక్షులు పాండుగౌడ్ మరియు జిల్లా గణేష్, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, శివరాజ్ గౌడ్, కృష్ణారావు, వెంకటేష్ గౌడ్, కైసర్, ప్రభాకర్, భాస్కర్ రెడ్డి, కట్టా శ్రీనివాస్, శ్రీధర్, ఉమేష్, సంతోష్ బిరాదర్, ఆదర్శ్, రాజు మరియు కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page