కాలనీల కాంటాక్ట్ కార్యక్రమం ను సద్వినియోగం చేసుకోండి మీ కాలనీల సమస్యలను పరిష్కరించుకోండి

Spread the love

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున హోమ్స్, విజేత గ్రీన్ హోమ్స్, శుభోదయ కాలనీ లలో జరిగిన కాలనీ కాంటాక్ట్ కార్యక్రమంలో సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ, బస్తీ, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లలో గల పలు సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా జిహెచ్ఎంసి మరియు వివిధ ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రత్యేక్షంగా వెళ్లి సమస్యలు తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ను చేపట్టడం జరిగినది అని, కాలనీ లలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించడానికి చక్కటి వేదిక అని, ఇంచు మించు 15 డిపార్ట్మెంట్ అధికారులు ఒకే వేదిక ను పంచుకోవడం జరుగుతుంది అని, మీ కాలనీ సమస్యలను నేరుగా చెప్పుకోవడానికి ఇది ఒక చక్కటి కార్యక్రమం అని, ప్రతి కాలనీ వారు సద్వినియోగం చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు పేర్కొన్నారు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు, కాలనీ ప్రతినిధులు,రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సంఘ సేవకులు ప్రతి ఒక్కరు చక్కగా సద్వినియోగం చేసుకొని మన కాలనీ లను, మన ప్రాంతాలను ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి చేసుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు తెలియచేశారు,

ఈ కార్యక్రమంలో అధికారులు అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ మహేందర్ రెడ్డి, ఏఈ లు రాజీవ్, ప్రశాంతి,వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ ముస్తఫ్ఫా ఎంటమాలజి సూపర్వైజర్ నర్సింహా, స్ట్రీట్ లైట్స్ సూపర్వైజర్ సుధాకర్, లైన్ మెన్ కాళీ,హరికల్చర్ దాసు, ఎస్ఎఫ్ఏ లు సంజీవ రావు, భరత్ డివిజన్ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు పోతుల రాజేందర్, కాలనీ వాసులు అప్పిరెడ్డి, మహేష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకట రత్న కుమార్, వెంకటేష్ ,సంగమేశ్వర్ రావు, రావూరి శ్రీనివాస్, నాగరాజు, సంపత్, శ్రీధర్, యుగంధర్ రెడ్డి, సమత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, వినయ్, పాపి రెడ్డి, తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page