SAKSHITHA NEWS

అక్రమ ఇసుకటాక్టర్ లకు రెండు నెంబర్ ప్లేట్లు
డిఎస్పీ పార్టీ నీ అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో అక్రమ ఇసుక దందామా జోలికి వస్తే అక్రమ కేసులు బనాయిస్తాం*.

అక్రమ ఇసుక ఒక్క టాక్టర్ కు 5500 నుండి 6000 వరకు విక్రయాలు

వంగూరు మండల కేంద్రంలోని పోల్కంపల్లి గ్రామానికి చెందిన డి.ఎస్.పి. పార్టీ చెందిన తాడెం రవి. శివ. వీరిద్దరూ అక్రమ ఇసుకలో బిల్లా రంగా మాదిరిగా చిక్కడు దొరకడు అనే విధంగా అధికారుల కన్నులుగప్పి విచ్చలవిడిగా ఆక్రమ ఇసుక రవాణా చేస్తుంటారు. ఈరోజు ఉదయం 5 గంటల జెపి నగర్ లోని భగత్ సింగ్ తండాలో అలాగే ఇంద్రానగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ట్రిప్పులు అక్రమ ఇసుక ట్రాక్టర్లల తో వేయడం జరిగింది.

ఇంద్రానగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పెట్రోల్ పంప్ దగ్గరడీజిల్. వేయించుకుంటూ ఉండంగా పర్మిషన్లు ఉన్నాయా అని అడగగా మైనింగ్. రెవెన్యూ. మొదలగు అధికారులకు ఇచ్చే మామూలుగా మేము ఇస్తున్నాం. మా దగ్గరికి ఎవరు రారు. కల్వకుర్తి పట్టణంలో ఇన్ని కెమెరాలు ఉన్నాయన్న మమ్మల్ని పట్టుకునేది ఉంటే పట్టుకోరా చెప్పు. నీకు ఏం కావాలో చెప్పు తీసుకో కానీ అక్రమ ఇసుక మా టాక్టర్ ఆపితే మంచిగా ఉండదు. నీపై అధికారులకు చెప్పి కేసు వేస్తాం అంటున్నారు.మరి ఇలాంటి వ్యక్తులకు సహకరించేది ఎవరు? ఏ అధికారి కనుల్లో ఇదంతా జరుగుతుంది. అక్రమ ఇసుక లో ఆరితేరిన పోల్కంపల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తులపై చర్యలు తీసుకోరా? ఇప్పటికైనా అక్రమ ఇసుకను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ. పట్టించుకుని సామాన్యునికి అతి తక్కువ ధరలో ఇసుక దొరికే విధంగా చూడాలని చింతపల్లి. వంగూర్. పోల్కంపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు అంటున్నారు.


SAKSHITHA NEWS