జాతీయ స్థాయి అథ్లెటిక్స్ అఫీషియల్ రెఫరీగా సయ్యద్ హైదర్ బాషా ఎంపికయ్యారు జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న పదవ పటాలం లోని సాయుధ చైతన్య పాఠశాలలో పనిచేస్తున్న సయ్యద్ హైదర్ పాషా ఈనెల 14 నుంచి 19 వరకు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జరిగే 19వ నేషనల్ ఇంటర్ డిస్టిక్ అథ్లెటిక్స్ క్రీడలకు జాతీయ రిఫరీగా సయ్యద్ హైదర్ భాష ఎంపికయ్యారు.
ఇటీవల నిర్వహించిన జాతీయస్థాయి అథ్లెటిక్స్ అఫీషియల్ (రెఫరీగా) పరీక్ష నిర్వహించగా జాతీయస్థాయిలో 59వ ర్యాంకు సాధించి ఎంపికయ్యారు. ఎఫ్ ఎస్ టి ఓ జాతీయస్థాయిలో ఉత్తీర్ణత సాధించి జిల్లాకు పేరు తేవడం గర్వకారణం అని గద్వాల్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బీసన్న కార్యదర్శి సతీష్ ఎస్ జి ఎఫ్ కార్యదర్శి జితేందర్ డి వై ఎస్ ఓ డాక్టర్ బి.ఎస్ ఆనంద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు సాయుధ చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు షాషావలి అభినందించారు.జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వెంకట రాములు సహాయ కార్యదర్శి నగేష్ బాబు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆంజనేయులు అశోక్ సభ్యులు అభినందించారు.