SAKSHITHA NEWS

స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకలపై ఎమ్మెల్యే
జిఎంఆర్ సమీక్ష
గ్రామం నుండి పట్టణ స్థాయి వరకు విజయవంతం చేయాలి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

సాక్షిత పటాన్చెరు : భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టనున్న వజ్రోత్సవాల వేడుకలపై పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి వివిధ శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఈనెల 9వ తేదీ నుండి 22వ తేదీ వరకు రెండు వారాలపాటు వేడుకలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

వేడుకల్లో భాగంగా స్వాతంత్ర సమరయోధులను సన్మానించడం, ర్యాలీలు, దీపాంజలి, జాతీయ సమైక్య దినం, శానిటేషన్ డ్రైవ్, ఇంటింటికి జాతీయ పతాకాలు అందించడం, కవి సమ్మేళనం, రంగోలి, సాంస్కృతిక కార్యక్రమాలు, చివరి రోజున ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం ఉంటుందని ఆయన తెలిపారు.

అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాలను దిగ్విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, బాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS