సువిధ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వారి 9వ వార్షికోత్సవాలు

Spread the love

సాక్షిత : సువిధ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్
ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 9 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కిశోరా చారి మాట్లాడుతూ 2014 నుంచి మాతో ప్రయాణించే క్లైంట్లు కస్టమర్లకు వర్క్ చేసే స్టాప్ కు సర్వీసెస్ అందించే ప్రొవైడర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్షికోత్సవ సందర్భంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా మోక్షిత హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ ద్వారా వీధి వ్యాపారులకు ప్రస్తుత ఎండలకు తట్టుకునే విధంగా గొడుగులను అందించారు. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా సువిధ కమ్యూనికేషన్స్ తరఫున విద్యార్థిని విద్యార్థులకు వికలాంగులకు వైట్ రేషన్ కార్డ్ హోల్డర్లకు ఉచిత సిమ్ కార్డులు మరియు 300 రూపాయలు విలువచేసే నెల రోజులపాటు రీఛార్జ్లను ఉచితంగా స్వచ్ఛందంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కిశోరా చారి, డైరెక్టర్లు స్నేహ, మేనేజర్లు లగడపాటి రాజేష్, సుంకర ,వీరేందర్ ,రామడుగు, క్రాంతి ,సాధన ,భాను, కుమార్, సురేష్ ,ఉత్తేజ్ ,సందీప్,సురేందర్, మణికంఠ,తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page