దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీసులు

Spread the love

10 లక్షల విలువగల బంగారు ఆభరణాలు సీజ్

  • ఇద్దరు దొంగల అరెస్ట్, రిమాండ్ 6 కేసులు గుర్తింపు

— జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా యస్.పి రాజేంద్రప్రసాద్

సూర్యాపేట సాక్షిత ప్రతినిధి

తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా దొంగతనాలు చేస్తున్న ఇద్దరు దొంగలని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల నుండి 10లక్షల విలువగల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నిందితులను రిమండ్ కి తరలించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో యస్.పి రాజేంద్ర ప్రసాద్ ఐపిఎస్ కేసుకి సంబంధించిన వివరాలు వెల్లడించారు. యస్.పి మాట్లాడుతూ నిందితులు ఇద్దరూ 2022 సంవత్సరంలో చర్లపల్లి జైల్లో పరిచయం అయ్యి జైలు నుండి విడుదలైన తరువాత కలిసి దొంగతనాలు చేద్దామని అనుకున్నారు. ఎ-1 జనవరి-2023 లో చర్లపల్లి జైల్ నుండి బెయిల్ పై బయటకు వచ్చి మొదటగా ఉప్పల్, మేడిపల్లి లో ఒంటరిగా రాత్రిపుట ఇండ్లలో దొంగతనాలు చేసాడు. ఆ తరువాత ఎ – 2 కు ఫోన్ చేసి తిరుపతికి వెళ్ళి ఇద్దరు కలిసి రెండు మోటార్ సైకిల్ లు దొంగిలించి వాటిపై తొర్రూర్, కోదాడ , సూర్యాపేట లో రాత్రిపుట సంచరిస్తూ తాళాలు వేసిన ఇండ్లను గమనించి తాళాలు పగుల కొట్టి ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసి దొంగిలించిన సొత్తుతో జల్సాలు చేసేవారని అన్నారు. మంగళవారం ఉదయం 5గం.ల సమయంలో సూర్యాపేట లోని హైటెక్ బస్ స్టాండ్ వద్ద సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి.రాజశేఖర్, ఎస్సై లు జి. సతీష్ వర్మ, యస్.కె. యాకూబ్ మరియు సిబ్బంది కరుణాకర్, కృష్ణ, ఆనంద్, మధు లు పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ మీద అనుమానాస్పదంగా వెళుతుండగా వారిని ఆపటానికి ప్రయత్నించగా ఆపకుండా పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకొని వారిని సోదా చేయగా వారి వద్ద కొన్ని బంగారు మరియు వెండి ఆభరణాలు ఉన్నవి. ఆ బంగారు ఆభరణాల గురించి ఎక్కడివని ప్రశ్నించగా అవి అన్నీ వారు ఇరువురు మేడిపల్లి, సూర్యాపేట, తొర్రూర్ మరియు కోదాడ లలో రాత్రి వెళలలో తాళం వేసిన ఇండ్ల లలో దొంగతనం చేసి వాటిని పోగు చేసి ఈ రోజూ హైదరాబాద్ లో అమ్ముటకు వెళ్తున్నట్లుగా ఒప్పుకున్నారు. నిందితుల వద్ద నుండి మొత్తం16 తులాల బంగారు ఆభరణాలు, 880 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ఆర్ -15 బైక్ మరియు దొంగతనానికి వాడిన మరొక బైక్ ను స్వాదీనం చేసుకోవటం జరిగిందని, నిందితులను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కి తరలిస్తామని తెలిపారు.
నిందితులపై గతంలో కడప, ఎల్.బి నగర్, మేడిపల్లి, ఉప్పల్, ఘట్కేసర్ కరీంనగర్, హుజూరాబాధ్ పోలీస్ స్టేషన్ లలో 62 కేసుల్లో ముద్దాయిలు గా నేర చరిత్ర ఉందని అన్నారు.
నిందితుల వివరములు
1.పింగిలి రఘువరన్ రెడ్డి అలియాస్ రఘు వయస్సు 33, కులం: రెడ్డి, వృత్తి; డ్రైవరు, నివాసం: ముత్తవల్లి గూడ, ప్రతాపసింగారం, మేడిపల్లి, మేడ్చల్ జిల్లా. స్థిర నివాసం: పెద్ద ముప్పారం గ్రామం, దంతాలపల్లి మండలం, మహబూబాబాద్ జిల్లా.

  1. బ్రహ్మదేవర రాజశ్రీ గణేష్ అలియాస్ గణేష్, వయస్సు; 39, కులం యాదవ, వృత్తి కారు డ్రైవరు, నివాసం: అలివేలు కాలనీ, తిరుచానూరు, తిరుపతి జిల్లా. స్థిర నివాసం: అశోక కాలనీ, శంకరాపురం, కడప టౌన్.
    ఈ కేసుని చాకచక్యంగా వ్యవహరించి చేదించిన
    సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ జి. రాజశేఖర్, ఎస్సై జి. సతీష్ వర్మ, యస్. కె. యాకూబ్, మరియు హెడ్ కానిస్టేబుల్ లు కరుణాకర్, కృష్ణ, కానిస్టేబుళ్లు సైదులు, ఆనంద్, మధు లను సూర్యాపేట డిఎస్పీ పి. నాగభూషణం, సూర్యాపేట జిల్లా యస్.పి ఎస్. రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. అనంతరం రివార్డుని అందజేయడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page