సూపర్ మాక్స్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలి.
సీపీఐ,సీపీఎం కార్యదర్శులు ఉమా మహేష్, లక్ష్మణ్.
సాక్షిత : గత 16 నెలల నుండి సూపర్ మాక్స్ కార్మికులకు జీతాలు ఇవ్వకుండా,ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కంపెనీని మూసివేయడం దారుణమని వెంటనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేనిపక్షంలో కార్మికుల ఉద్యమాలు తీవ్రరూపం దాలుస్తాయని జీడిమెట్ల డిపో,సూపర్ మాక్స్ కంపెనీ ఎదురుగా నిర్వహించిన ధర్నా సందర్భంగా పాల్గొని సంఘీభావం ప్రకటించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కార్మికుల నిరసన దీక్ష చేస్తుంటే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి,స్థానిక శాసనసభ్యులు వివేకానంద, కాంగ్రెస్,బీజేపీ నాయకులు వచ్చి సంఘీభావం ప్రకటిస్తున్నారు కానీ వారి సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది అన్నట్టు మారిందని,కార్మికుల కోసం చేస్తున్నామని చెపుతున్న ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదని,కావున ప్రజలు కార్మికులు నిజంగా కార్మికుల కోసం,కార్మిక రాజ్యం కోసం ఉద్యమించే పార్టీలను అధికారంలోకి తీసుకివస్తే ఇలాంటి సమస్యలు ఉండవని కావున ప్రజలు ఆలోచించి రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి కార్మిక వ్యతిరేక పార్టీలకు బుద్ధి చెప్పి,కార్మిక శ్రేయాసు కోసం పాటుపడే వారిని గెలిపించాలని కోరారు.సూపర్ మాక్స్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం రానున్న రోజుల్లో వివిధ రూపాల్లో పోరాటం కొనసాగించాలని కోరారు,దానికి సీపీఐ, సీపీఎం పార్టీలు అన్నివేళలా మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ,సిఐటియు నాయకులు స్వామి, దేవదానం,రాము, కనకయ్య,చంద్రమౌళి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.