ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలి. అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఏకాగ్రతతో చదివి ఉన్నతంగా ఎదగాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.ఎస్.పి. కాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో పిల్లల సంఖ్య, హాజరు గురించి ఆడిగి తెలుసుకున్నారు.
పిల్లలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందినది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయునిలా పిల్లలకు క్లాస్ తీసుకున్నారు. చదువు ఎంతో ముఖ్యమని, చదువుతో సమాజంలో గౌరవించబడతారని ఆయన అన్నారు. నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని, దృఢ సంకల్పంతో రాణించాలన్నారు. మన ముందు ఉన్నత లక్ష్యం ఏర్పరచుకొని, లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని పిల్లలకు ఉద్భోదించారు.