SAKSHITHA NEWS

Students will study well in the future
To be highly regarded

విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో
ఉన్నతంగారాణించాలి……….
జెడ్పీ చైర్మన్,ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్

సాక్షిత వనపర్తి
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యార్థులంతా బాగా చదువుకుని భవిష్యత్ లో ఉన్నంతంగా రాణించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకాంక్షించారు.

  బుధవారం బడిబాట కార్యక్రమం లో భాగంగా పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని హరిజన వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తో కలిసి, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డితో కలిసి హాజరయ్యారు. పాఠశాలల పునః ప్రారంభం సందర్బంగా సరస్వతీ పూజ నిర్వహించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. 
      ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకోడానికి ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏక రూప దుస్తులు అందించడమే కాకుండా, అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని.. కాబట్టి అందరూ బాగా చదువుకొని భవిష్యత్ లో గొప్పగా ఎదగాలని సూచించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులతో నాణ్యతతో కూడిన విద్యను అందిస్తోంది, కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలని చెప్పారు.

బడి బయట పిల్లలు ఎవరూ ఉండొద్దని, అలాంటి వారిని గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పారు. విద్యార్థులు నాలెడ్జి, నైపుణ్యం, వ్యక్తిగత వికాసం ఈ మూడింటి పై దృష్టి సారించాలన్నారు. ఒక అమ్మాయి చదువు ఇంటికి వెలుగు అని, నేడు అన్ని రంగాల్లో బాలికలు ముందున్నారని చెప్పారు.

విద్యా రంగం బలోపేతానికి సీఎం కృషి : ఎమ్మెల్యే మేఘా రెడ్డి
రాష్ట్రం లో విద్యా వ్యవస్థ బలోపేతం కోసం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఎమ్మెల్యే మేఘా రెడ్డి తెలిపారు. బడిబాట లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్, పాఠ్య పుస్తకాల, ఏకరూప దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి పిల్లలందరూ బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించి అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామని, ఎల్లవేళలా సహకారం ఉంటుందని తెలిపారు.

కలెక్టర్ల పర్యవేక్షణ తోనే పాఠశాలల్లో మెరుగైన విద్య: జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

    పిల్లలు పౌష్టికహారం తీసుకుని చక్కగా చదువుకోవాలని జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి అన్నారు. విద్యార్ధి దశలో ఉన్నప్పుడే బాగా చదువుకోవాలని, ఈ వయసు మళ్ళీ తిరిగి రాదని సూచించారు. విద్యా రంగం పై కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతోందని చెప్పారు. ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. పిల్లలు గొప్పగా ఎదిగి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. 

ఈ సందర్బంగా విద్యార్ధినుల నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి. పదో తరగతి లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు శాలువాతో సత్కరించారు.
అంతకుముందు కలెక్టర్ తాడిపర్తి ప్రాథమికొన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమం లో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు.
కార్యక్రమం లో ఆర్.డీ.ఓ పద్మావతి, మునిసిపల్ కమీషనర్, ఎంపీపీ కిచ్చారెడ్డి, మునిసిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ, తహసీల్దార్, ప్రిన్సిపాల్ ఉమాదేవి, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 06 12 at 16.40.25

SAKSHITHA NEWS