పంచాయతీ ఓటర్ జాబితా రూపకల్పనకు పటిష్ట చర్యలు
-రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్థసారధి
-పంచాయతీ ఎన్నికల సన్నద్దతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
పంచాయతీ ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్థసారథి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్థసారథి హైదరాబాద్ నుండి పంచాయతీ ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్లు డి యాల్.వేణు గోపాల్, విద్య చందన లతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి.పార్థసారథి మాట్లాడుతూ, జిల్లాలోని గ్రామ పంచాయతీలలో వార్డుల వారీగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ఫోటోతో కూడిన ఓటర్ జాబితా రూపకల్పన చేయాలని అన్నారు. ఓటరు జాబితా నుంచి గ్రామ పంచాయతీ ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వార్డుల వారీగా కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణకు గ్రామంలోని వార్డుల వారీగా అవసరమైన మేర పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని అన్నారు. పంచాయతీ ఎన్నికలనిర్వహణకు అవసరమైన మేర సిబ్బందిని గుర్తించి వారి వివరాలను అందజేయాలని, రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులుగా విధులు నిర్వహించే వారికి అవసరమైన శిక్షణ అందించేందుకు వీలుగా ప్రతి జిల్లా నుంచి 10 మంది రీసోర్స్ పర్సన్ ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి శిక్షణకు పంపాలని అన్నారు. ఈ వీడియో కాన్పరెన్సు లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య , జడ్పీ సీఈవో చంద్రశేఖర రావు, డిపిఓ చంద్రమౌళి, ఎలక్షన్ సెల్ సూపర్డెంట్ ధారా ప్రసాద్, డి.ఎల్.పి సుధీర్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.