పేషెంట్ల పై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్పొరేట్ ఆసుపత్రులకు ఆదేశం
శ్రీకాకుళం :
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వైద్యం తీసుకొనే పెషెంట్లపై ఆర్థిక భారం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి పేషెంట్ల నుండి ఏ విధమైన నగదు వసూలు చేయకుండా వైద్యం చేయడంపై కార్పొరేట్ ఆసుపత్రులతో శనివారం ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేషెంట్లపై ఆర్థిక భారం వేయకుండా నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించాలన్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆసుపత్రుల్లో చేరే పేషెంట్లకు నాణ్యమైన, మెరుగైన వైద్యం అందించే బాధ్యత ఆరోగ్య మిత్ర బాధ్యత వహించాలన్నారు. పేషెంట్స్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే సమావేశం రోజున సమావేశానికి ఫిర్యాదు చేసే పేషెంట్లను కూడా పిలవాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ
కో ఆర్డినేటర్ ను ఆదేశించారు.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ పొగిరి ప్రకాశరావు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో పేషెంట్లకు వైద్య పరీక్షలు చేసే చార్జీలు డిసిప్లే చేయాలన్నారు. సెకండరీ పరీక్షలకు పేషెంట్ల నుండి నగదు వసూలు చేయరాదని చెప్పారు. ఫైర్, బయోమెడికల్ వేస్టేజ్
మేనేజ్మెంట్ లపై కలెక్టర్ ఆరా తీయగా రెయిన్బో కి ఇస్తున్నట్లు ప్రకాశరావు తెలిపారు. పేషెంట్లు ఆసుపత్రులకు వైద్యం నిమిత్తం వస్తే అక్కడ ఆ వైద్యం లేకపోతే ఎక్కడైతే ట్రీట్ మెంట్ ఇస్తారో ఆ ఆసుపత్రుల పేర్లు ఖచ్చితంగా తెలిపాలన్నారు. భోజనం మెనూలో పాలు, పళ్లు ఉన్నట్లు చూడాలని చెప్పారు. 108 సర్వీసులను పక్కాగా వినియోగించాలని వివరించారు. వివిధ ఆసుపత్రుల పై ఫిర్యాదులు గూర్చి ఆయన ఆడుగగా ఫిర్యాదులపై కో ఆర్డినేటర్ కలెక్టర్ కు వివరించారు.
ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రాజ్యలక్ష్మి, డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీకాంత్, కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించి ప్రతినిధులు జెమ్స్ నుండి జనరల్ మేనేజర్ డాక్టర్ ప్రవీణ్ కుమార్, కిమ్స్ నుండి సోమేశ్వరరావు, మెడికవర్ నుండి మేనేజర్ శివ కుమార్, తదితర ఆసుపత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.