SAKSHITHA NEWS

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

సైదాపూర్ మండలం

సైదాపూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ రైతు వేదిక సైదాపూర్ లో జరిగిన ఫర్టిలైజర్ షాపుల యజమానులతో నిర్వహించిన సమావేశంలో నకిలీ, విత్తనాలు మందులు నిషేధిత విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ బావు సింగ్ తో పాటు స్థానిక ఎస్సై జన్ను ఆరోగ్యం, మండల వ్యవసాయ అధికారిని వైదేవి ,తెలిపారు. మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో ఫర్టిలైజర్ షాపుల నందు నకిలీ విత్తనాలు నకిలీ మందులు అమ్మినట్లు రైతుల దృష్టికి వస్తే మాకు సమాచారం ఇవ్వాలని ఎస్సై ఆరోగ్యం తెలిపారు ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన, ఎరువుల దుకాణాలను కలిసి తనిఖీ చేయాలని రికార్డులు, స్టాకు రిజిస్టర్లను పరిశీలించాలని రైతులు విత్తనాలు, ఎరువు కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు పత్తి, కంది సాగు రైతులు ఏవోల, ఏఈఓ ల సలహాలను పాటించాలన్నారు రైతు ఖరీదు చేసే సమయంలో కొనుగోలు చేసిన పత్తి గింజలు లేదా మందులు ప్రతి దానికి రసీదు ఇవ్వాలని దుకాణదారులను ఆదేశించారు.


SAKSHITHA NEWS