అక్రమ అరెస్టులకు తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం

Spread the love

state government opened the door to illegal arrests

అక్రమ అరెస్టులకు తెరలేపిన రాష్ట్ర ప్రభుత్వం ….
నిన్న హైదరాబాదులో కాంగ్రెస్ వ్యూహ కర్త వార్ రూమ్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు

ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను వీణవంక పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది ఈ సందర్బంగా వీణవంక మండలం కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతు….

ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రతి పౌరుని హక్కు అలాంటి హక్కులను కాలు రాస్తూ పోలీస్ వ్యవస్థతో రాజ్యమేలుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు యంత్రాంగం అత్యుత్సాహంతో రాష్ట్ర ప్రభుత్వ మన్ననలు పొందడానికి అ ప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకులను, అక్రమ అరెస్టులకు పూనుకుంది దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వీణవంక మండలంలో ఈ రోజు ఉదయం అక్రమ అరెస్టులు చేశారని, ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, సుఖాసి యాదగిరి, గుంపుల గట్టయ్య, మందల అనిల్ రెడ్డి, ఎండి సలీం,రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page