శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని, శ్రీల టవర్స్,

Spread the love

సాక్షిత : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని, శ్రీల టవర్స్, సెవెన్ హిల్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయం, వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్, మిత్ర హిల్స్, కృష్ణవేణి కాలనీ, HMT హిల్స్, శ్రీనివాస కాలనీ, ఆదిత్య నగర్ కాలనీల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం న ప్రజలు అందరూ సుఖ శాంతుల తో గడపాలని ఆకాంక్షించారు. అదేవిధంగా. శ్రీరామ నవమి, సీతా రామ కళ్యాణం.వివాహము ఎలా జరగాలో నేర్పి చూపించిన అవతారము శ్రీ రామ అవతారము. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి జరిగి ఉండవచ్చు. రామనామ వైభవము మాత్రము అలా ఉండిపోయింది. వశిష్ఠుడు ఇచ్చిన రామనామము ఎంతగొప్పది అంటే ర అన్న అక్షరము అష్ఠాక్షరీ మహా మంత్రములోని ప్రధానమైన బీజాక్షరము. మ కారము పంచాక్షరీ మహా మంత్రములో ఉన్న ప్రధానమైన బీజాక్షరము. రామ అన్నప్పుడు అగ్ని బీజము అమృత బీజము అనుసంధానము ఎవరు రామ నామమును చదువుతుంటే ర అనడమువలన అగ్నిచేత పాపములు కాలిపోతాయి. మ అన్నప్పుడు నోరు మూసుకుని మళ్ళీ పాపములు లోపలకు వెళ్ళే అవకాశము ఉండదు. రాముని ఉద్దేశించి అనకపోయినా శ్రీరామ అన్నా రామ అన్న నామమునకు అంత శక్తి ఉన్నది. ఎంత కాలము రామనామము చెప్పబడుతుందో రామాయణము ఎంత కాలము చదవబడుతుందో ఎంతకాలము రామచంద్రమూర్తిని మనము అనువర్తిస్తామో రాముడిని ఆదర్శముగా తీసుకుని బతుకుతామో అంతకాలము శ్రీరామ రాజ్యము విలసిల్లుతుంది. లోకము సుభిక్షముగా ఉంటుంది. రామచంద్రమూర్తి జీవితమును చెప్పుకుంటే చాలు. అందరికీ రామ భక్తి కలుగుగాక స్వామి మన చేత రామనామము పలికించుగాక రామును యొక్క బలము పెరుగుగాక. అని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరియు హైదర్ నగర్ డివిజన్ ప్రజానీకానికి, తెలుగు ప్రజలందరికి శ్రీ రామ నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది.

ఈ కార్యక్రమంలో మాధవ్, సాయి బాబు, మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page