సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ నగర్ కాలనీ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో వివేకానంద నగర్ కాలనీ ప్రజల సౌకర్యార్థం ఎమ్మెల్యే సీడీపీ నిధులు మరియు దాతల సహకారం తో ఒక కోటి రూపాయల అంచనావ్యయంతో 9 లక్షల లీటర్ల సామర్థ్యంతో నూతనంగా నిర్మించిన నీటి నిల్వ మంచి నీటి సంపు ను కాలనీ అసోసియేషన్ సభ్యులు, కార్పొరేటర్ శ్రీమతి రోజాదేవి రంగరావు తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ వివేకానంద నగర్ కాలనీ లో నీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారం గా వివేకానంద నగర్ కాలనీ ప్రజల మంచి నీటి సౌకర్యార్థం తన ఎమ్మెల్యే సీడీపీ నిధుల నుండి 15 లక్షల రూపాయలు మరియు ఇతర దాతల సహకరం తో మొత్తం 1 కోటి రూపాయల అంచనా వ్యయం తో 9 లక్షల లీటర్ల నీటి నిల్వ గల మంచి నీటి సంపు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, కాలనీ ప్రజల దాహార్తి తీర్చడానికి ఈ మంచి నీటి సంపు ఎంతగానో తోడ్పడుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .ఇది ఒక శుభపరిణామం అని అదేవిదంగా ముఖ్యమంత్రి కెసిఆర్ కళల ప్రాజెక్ట్ ఐన మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి మంచి నీటి నల్లా కనెక్షన్ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగు నీరు అందించే లక్ష్యమే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, మరియు 20,000 లీటర్ల ఉచిత మంచి నీటి పథకం ద్వారా మంచినీరు అందిస్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ తెలిపారు . శేరిలింగంపల్లి నియోజకవర్గం లో మంచి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా 18 రిజర్వాయర్ల ను నిర్మించుకొని ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన మంచి నీరు అందిస్తున్నాము అని , అదేవిదంగా మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి నల్ల కనెక్షన్ ద్వారా నీటి సరఫరా చేపట్టడం జరుగుతుందని మరియు ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచి నీటి ని ఇవ్వడం జరుగుతుందని నీటి సమస్య లేని నియోజకవర్గం గా తీర్చిదిద్దుతానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. సంపు నిర్మాణం కొరకు తన స్వంత నిధుల ద్వారా (ఇంచు మించు 15 లక్షల రూపాయల వరకు) సంపు నిర్మాణం పై కప్పు ఖర్చును భరించడం జరిగినది అని, కాలనీ లో సంపు నిర్మాణం కోరకు కృషి చేసిన వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా వివేకానంద నగర్ కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని , డివిజన్ మరియు నియోజకవర్గ అభివృద్ధికి శాయశేక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రంగరావు వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, తెరాస నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు,రాంచందర్ ,హిమగిరి, అల్లం మహేష్ మరియు వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ వడ్డేపల్లి రాజేశ్వరరావు, సెక్రటరీ గుమ్మడి నర్సయ్య, ట్రెజరర్ జయ బాల్ రెడ్డి, మెంబెర్లు కుసుమ కుమారి, శివ రెడ్డి, రంగ రావు, రాంచందర్ రావు, కాలనీ వాసులు దేవి నేని శివరామ ప్రసాద్ , విజయ్ బాబు ,శ్రీధర్ బాబు ,రాంచంద్రం ,అశోక్, నాని మరియు కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు