రంజాన్ , శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని మసీదులు, ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలనీ ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు అధికారులకు సూచించారు.
సాక్షిత : జీహెచ్ఎంసీ కూకట్పల్లీ జోనల్ కార్యాలయంలో అధికారులతో మరియు ముస్లిం సోదరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముస్లీం మైనార్టీలకు రంజాన్ మాసం మొదలవడంతో పాటూ హిందువులకు ప్రధానమైన శ్రీరామ నవమి వేడుకలు కూడా రానున్నాయనీ అన్నీ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉంటూ సమస్యలను పరిష్కరించి అవసరమైన సదుపాయాలు కల్పీంచాలనీ ఆదేశించారు. కూకట్ పల్లీ నియోజకవర్గం పరిధిలోనీ అన్ని డివిజన్లలో మసీదులు , ఆలయాల వద్ధ పరిశుభ్రత , తాగునీటి సదుపాయం, విద్యుత్ దీపాలు , ట్రాఫిక్ సమస్యలు వంటివీ సత్వరం పరిస్కరించాలనీ సూచించారు.
అన్ని విభాగాల ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్ధాయిలో పర్యటించీ మసీదులు, ఆలయాల కమిటీ ప్రతినిధులను అడిగి సమస్యలు తెలుసుకొని పరిష్కారించాలని ఆదేశించారు. హైదరాబాద్ మహా నగరం అన్ని మతాలకు కులాలకు సాంప్రదాయాలకు, సంసృతులకు సమ ప్రాధాన్యం ఇస్తుందనీ ప్రజలందరూ సోదరాభావంతో కలిసిమెలసీ పండుగలను జరుపుకోవాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జోనల్ కమీషనర్ మమత , ఏసీపీలు చంద్రశేఖర్, గంగారామ్, జలమండలీ అధికారీ వెంకటేశ్వర్లు , ఉప కమీషనర్లు రవికుమార్, రవీందర్ లతో పాటూ వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.