స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్..!
హైదరాబాద్:
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేశారు కొంత మంది జాదూగాళ్ళు..
ఆయన ట్విట్టర్ అకౌంట్ ను… హ్యాక్ చేసి అసభ్య కరమైన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.
ఈరోజు ఉదయం నా వ్యక్తిగత అకౌంట్ ట్విట్టర్.. కొంత సమయం హ్యాకింగ్ అయిందని పేర్కొన్నారు. మా టెక్నికల్ టీం ఈ విషయాన్ని గమనించి వెంటనే తగిన చర్యలు తీసుకుని తిరిగి సెట్ చేశారని వెల్లడించారు.
నా X హ్యాకింగ్ అయిన సమయంలో నా అకౌంట్ లో వచ్చిన వీడియోలు, పోస్ట్ లకు నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను అంటూ చెప్పారు…